రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కార్యాలయాల్లో కనీస వసతలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి అన్నారు. మొత్తం 141 సబ్ రిజిస్ట్రేసన్ కార్యాలయాల్లో కేవలం 8 కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని, మిగిలినవన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు మంత్రి వివరించారు. మండలిలో సభ్యులు వాణీదేవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, బానుప్రసాద్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఇప్పటికే 87 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం రూ.64.58 కోట్లు నిధులు మంజూరు చేశామని వివరించారు. 22 కార్యాలయాలు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయని... మరో 17 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. నాలుగింటిని ప్రభుత్వ కార్యాలయలకు షిఫ్ట్ చేశామని... మరో నాలుగు భవనాలు దానం చేశారని రహదారులు భవనాల శాఖ వివరించారు. మిగిలినవి కూడా నిర్మాణం పూర్తయితే 53 భవనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరో 48 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన వివరాంచారు. కడతాల్, అమన్‌గల్‌లో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు గురించి ఆలోచిస్తామన్నారు.