తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. జీవితకాల ఉద్యమకారుడైన ఆచార్య జయశంకర్ తన చివరి శ్వాస వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడారని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
ఆచార్య జయశంకర్‌కు నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి - మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆచార్య జయశంకర్ వర్ధంతి
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్‌లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Minister Prashanth Reddy
తెలంగాణ భవిష్యత్ తరాలకు ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని మంత్రి వేముల అన్నారు. ఆచార్య జయశంకర్ కలల సాకారం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారన్నారు. బీడు భూముల్లోకి నీళ్లు పారినపుడే తెలంగాణ రైతుల గోస తొలగిపోతుందన్న జయశంకర్ ఆశయాన్ని కేసీఆర్ నిజం చేసి రైతుల కళ్లల్లో వెలుగులు నింపారని మంత్రి చెప్పారు.
ఇదీ చూడండి :ఎన్నికల్లో 'కరోనా ట్రెండ్'కు ఆ రాష్ట్రం నుంచే నాంది!