విదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణానికి తిరిగి వచ్చిన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన వెబ్సైట్ ప్రారంభమైంది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) రూపొందించిన ఈ ప్రత్యేక వెబ్సైట్ను ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు గల్ఫ్ దేశాలు, ముంబయి, సూరత్, తదితర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న దృష్ట్యా... వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రణాళికల్లో భాగంగా ఆవిష్కరించిన ఈ వెబ్సైట్లో కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని నిర్మాణ రంగ సంఘాల ద్వారా వారికి ఉపాధి లభించనుంది.