తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల - telangana varthalu

నూతన సచివాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీ4 ర్యాప్ట్​ ఫుట్టింగ్​ను పరిశీలించిన మంత్రి... ఇది నిర్మాణంలో కీలక ఘట్టమని స్పష్టం చేశారు.

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వేముల
నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వేముల

By

Published : Feb 25, 2021, 9:19 PM IST

సచివాలయ నిర్మాణ పనులు పకడ్బందీగా జరుగుతున్నాయని రోడ్లు భవనాలు గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 200సంవత్సరాలపాటు నిర్మాణం పటిష్టంగా ఉండేలా భూకంపాలను సైతం తట్టుకునేలా నాణ్యతతో పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ఐఐటీ నిపుణుల సూచన, స్ట్రక్చర్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు వేగవంతంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగిన మంత్రి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బీ4 ర్యాప్ట్‌ ఫుట్టింగ్​ను మంత్రి పరిశీలించారు. ఈ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ నిర్మాణంలో కీలకఘట్టమని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క ఫుట్టింగ్‌లో 115టన్నుల స్టీల్‌,780 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ అంటే 8వేల బస్తాల సిమెంట్‌ వినియోగించినట్లు మంత్రి వివరించారు. మంత్రి వెంట ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, షాపూర్ జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్, పలువురు అధికారులు ఉన్నారు.

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వేముల

ఇదీ చదవండి: ఆరేళ్లలో 1,32,899 ఉద్యోగాల భర్తీ... చిత్తశుద్ధి మాకే ఎక్కువ: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details