తెలంగాణ

telangana

ETV Bharat / state

MINISTER VEMULA: 'రీజనల్ రింగ్​ రోడ్డుతో.. స్థిరాస్తి రంగానికి ఆకాశమే హద్దు' - minister vemula prashanth reddy inaugurated credai property show

హైదరాబాద్​లో త్వరలో అందుబాటులోకి రానున్న రీజనల్​ రింగ్​ రోడ్డు ద్వారా స్థిరాస్తి రంగం మరింత ఊపందుకుంటుందని మంత్రి వేముల అభిప్రాయపడ్డారు. నగరంలో ఏర్పాటు చేసిన పదో క్రెడాయ్​ ప్రాపర్టీ షోను మంత్రి ప్రారంభించారు.

MINISTER VEMULA
పదో క్రెడాయ్​ ప్రాపర్టీ షో

By

Published : Aug 13, 2021, 5:07 PM IST

దేశంలో ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందుకు రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన మెరుగైన పాలన, దీర్ఘదృష్టి విధానాలే కారణమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్బిషన్ హాలులో ఏర్పాటుచేసిన పదో ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీషోను మంత్రి ప్రారంభించారు.

'రీజనల్ రింగ్​ రోడ్డుతో.. స్థిరాస్తి రంగానికి ఆకాశమే హద్దు'

హైదరాబాద్​కు రీజనల్​ రింగ్​రోడ్డు రానుంది. అందుకు సంబంధించి పరిశీలనలు జరుగుతున్నాయి. వలయ రహదారితో హైదరాబాద్​ స్థిరాస్తి రంగానికి ఆకాశమే హద్దు. చౌక ధరల్లో ప్లాట్లు దొరుకుతాయి. ప్రజలకు మంచి అవకాశాలు కలుగుతాయి. -వేముల ప్రశాంత్​ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి

మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో 15 వేలకు పైగా ప్రాపర్టీలను వినియోగదారులు ఎంపిక చేసుకునే వీలుంది. కొవిడ్ నేపథ్యంలో గతేడాది క్రెడాయ్ ప్రాపర్టీ షోకు బ్రేక్ పడగా.. ఈసారి స్టాళ్లను సైతం వందకే పరిమితం చేశారు. నగరానికి త్వరలో అందుబాటులోకి రానున్న రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్​ స్థిరాస్థి రంగం మరింత ఊపందుకుంటుందని మంత్రి వేముల ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:Schools Reopen: 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు!

ABOUT THE AUTHOR

...view details