తెలంగాణ

telangana

ETV Bharat / state

వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న వేముల - Minister vemula Prashant Reddy latest news

జూబ్లీహిల్స్​లోని వెంకటేశ్వర స్వామిని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 2021 నూతన సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి
వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి

By

Published : Jan 1, 2021, 12:24 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని వెంకటేశ్వర స్వామిని(టీటీడీ) మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పెళ్లిరోజు, న్యూ ఇయర్​ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

2021 నూతన సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. పేదలు, రైతుల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రికి మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్థించామని తెలిపారు. రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details