తెలంగాణ

telangana

ETV Bharat / state

భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్.. మంత్రి నుంచి ఫోన్​ - దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

ఏపీలోని విజయవాడకు చెందిన దివ్యాంగురాలు తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించి.. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్​ను ఆదేశించారు.

భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్​... మంత్రి నుంచి ఫోన్​...
భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్​... మంత్రి నుంచి ఫోన్​...

By

Published : Dec 18, 2020, 4:06 PM IST

తమ కుటుంబానికి చెందిన భూమిని కొందరు ఆక్రమించారంటూ.. ఓ దివ్యాంగురాలు సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసిన వీడియోపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. ఏపీలోని విజయవాడకు చెందిన మౌనికా సత్య.. చిన్నతనం నుంచే ఎముకల బలహీనతతో బాధపడుతోంది. తనకున్న ఒక్క ఆధారాన్నీ.. భూ కబ్జాకోరులు లాక్కున్నారని వాపోయింది.

దీనిపై వెంటనే స్పందించిన మంత్రి.. బాలిక కుటుంబంతో తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. తక్షణమే విషయంపై ఆరా తీసి వారికి న్యాయం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆదేశించారు.

భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్​... మంత్రి నుంచి ఫోన్​...

ఇదీ చదవండి:'ఇక నుంచి అన్ని అధికారిక కార్యక్రమాల్లో మిషన్ భగీరథ నీళ్లే'

ABOUT THE AUTHOR

...view details