Minister Uttam Kumar on Civil Supplies in Telangana: రాష్ట్రంలో దారిద్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar) అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో ఆ శాఖ కార్యకలాపాలు, పనితీరుపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కార్యాలయానికి వచ్చిన మంత్రికి పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
విద్యుత్ శాఖ అప్పు 81,516 కోట్ల రూపాయలు - ముఖ్యమంత్రికి ప్రజంటేషన్ ఇచ్చిన అధికారులు
Uttam Kumar on Rice Distribution in Telangana : రాష్ట్రంలో వానా కాలం, యాసంగి సీజన్లలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోలు కేంద్రాల సేకరణ, మిల్లింగ్ సామర్ధ్యం, రైస్ మిల్లర్ల వ్యవహారశైలి, ఛౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మంత్రికి వివరించారు. కేంద్రం పరంగా తలెత్తుతున్న ఇబ్బందులు, ఇంకా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు వంటి అంశాలపై ప్రత్యేక నోట్ తయారు చేసి ఇస్తే రేపు దిల్లీలో కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పియాష్ గోయల్‌నుకలిసి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరతానని ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తాం - నీటి వాటా విషయంపై కేంద్రంతో చర్చిస్తాం : ఉత్తమ్
రాష్ట్రంలో పౌరసరఫరాల వ్యవస్థ బలోపేతంపై కేంద్రమంత్రి వద్ద ప్రస్తావిస్తానని చెప్పారు. పీడీఎస్ కింద పంపిణీచేస్తున్న బియ్యం నాణ్యతగా లేకపోవడం వల్ల ఎక్కువ మంది తినడం లేదని, బియ్యం పక్కదారి పడుతున్నాయని ప్రస్తావించారు. పౌల్ట్రీ, హోటళ్లకు దారి మళ్లుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు.
"రూ.500లకే సిలిండరు, వరి పంటకు రూ.500 బోనస్ ఈ రెండు గ్యారంటీలు వంద రోజుల పరిపాలనలో చేయడానికి కట్టుబడి ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో బియ్యం దారి మళ్లుతోంది. కేంద్ర, రాష్ట్రాలకు కలిపి కిలో బియ్యానికి రూ.39 ఖర్చు అవుతుంది. అదే డబ్బులతో వారికి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తే దీని ఉద్దేశం, లక్ష్యం మారుతుంది. రైతుల దగ్గర ప్రొక్క్యూర్‌మెంట్ మంచిగా జరగాలి, వెంటనే డబ్బులు అందాలి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరెషన్‌కు ఆర్థిక సహాయం అందించకపోవడం వల్ల మొత్తం అప్పులు రూ.56 వేల కోట్లకు చేరింది."ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి
పార్టీకి నమ్మిన బంటు, ఆపత్కాలంలో ఆపద్బాంధవుడు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే
రీసైక్లింగ్, పాలిషింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారని దానిని అరికట్టాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ, నాణ్యమైన బియ్యం రాబట్టడంపై ఇక నుంచి పౌరసరఫరాల శాఖ దృష్టి సారించాలని మంత్రి సూచించారు. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, గత ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు రాకపోవడంతో మొత్తం అప్పులు రూ.56 వేల కోట్లకు పెరిగాయని, ఆ లోటు భర్తీ చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
Minister Uttam Kumar on Civil Supplies in Telangana తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తం అప్పులు రూ.56వేల కోట్లు ఉత్తమ్ పంట ఉత్పత్తి, మార్కెటింగ్‌ని పెంచేందుకు కృషి చేయాలి - తుమ్మల