తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి తానేటి వనిత గన్‌మెన్ చంద్రారావు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో కుమార్తె గాయత్రి, అల్లుడు కిరీటిపై దాడి చేశాడు.
కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రి గన్‌మెన్ వీరంగం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి తానేటి వనిత గన్‌మెన్ చంద్రారావు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. తనకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కూతురు, అల్లుడిపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో దాడి చేశాడు.
ఐదు నెలల కిందట తానేటి వనిత గన్‌మెన్ చంద్రారావు కుమార్తె గాయత్రి, కిరీటీ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి చంద్రారావు వారిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దాడి చేశాడు. ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లగా.. చంద్రారావుపై కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలోనూ.. ఈ జంటపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొవ్వూరు మండలంలో గ్రామ సచివాలయంలో పని చేస్తున్న తనను... చంద్రారావు పరపతి ఉపయోగించి.. ఏలూరుకు బదిలీ చేయించినట్లు గాయత్రి ఆరోపిస్తోంది. తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కావాలని కోరుతోంది.
ఇదీ చూడండి:ఆర్మీ జవాన్ తల్లిపై దౌర్జన్యం.. భూమి తనదేనంటూ దాడి