విజయ డెయిరీ బలోపేతంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పాడి రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలనిస్తూ పాల సేకరణ సామర్థ్యం పెంపొందిస్తోన్నామని పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలో శ్రీఅను క్యాంటీన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
'ప్రైవేటు డెరీలకు దీటుగా విజయ డెయిరీ' - Hyderabad District latest News
రాష్ట్రంలో ప్రైవేటు డెరీలకు దీటుగా విజయ డెయిరీని బలోపేతం చేస్తోన్నామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శాసనసభ ప్రాంగణంలో శ్రీ అను క్యాంటీన్ ఎదురుగా ఏర్పాటు చేసిన విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

'ప్రైవేటు డెరీలకు ధీటుగా విజయ డెయిరీ'
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దశల వారీగా జంట నగరాల్లో నూతన ఔట్‌లెట్లు ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాడిపరిశ్రామాభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో 6 రౌండ్లు పూర్తి... తెరాస ఆధిక్యం