తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే సినిమా షూటింగ్​కు అనుమతి: తలసాని - minister thalasani on cinema tv shootings

రాష్ట్రంలో త్వరలోనే సినిమా చిత్రీకరణలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ పేర్కొన్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న సినీ, టీవీ పరిశ్రమ కార్మికులకు ఈనెల 28న నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలిపారు.

minister thalasani srinivas yadav
వీలైనంత త్వరగా చిత్రీకరణలు ప్రారంభిస్తాం: తలసాని

By

Published : May 26, 2020, 2:29 PM IST

రాష్ట్రంలో వీలైనంత త్వరలో సినిమా, టీవీ ధారావాహికల చిత్రీకరణలు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని కమ్యూనిటీ హాల్లో సినీ, టీవీ పరిశ్రమ కార్మికులకు పంపిణీ చేసేందుకు సమకూర్చిన నిత్యావసర సరుకుల సంసిద్ధతను మంత్రి పరిశీలించారు.

ప్రస్తుతం ఎన్ని చిత్రాలు చిత్రీకరణకు సిద్ధంగా ఉన్నాయో ఆ జాబితాను సిద్ధం చేయాలని సినీ పరిశ్రమ పెద్దలకు సూచించినట్లు మంత్రి పేర్కొన్నారు. సినిమా థియేటర్లు పునరుద్ధరించే అంశంపై ఫిలిం​ఛాంబర్​ పెద్దలతో మాట్లాడి.. ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చిత్రీకరణ​లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వంటి పరిణామాల నేపథ్యంలో.. ఆయా విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో సుమారు 14 వేల మంది సినీ, టీవీ పరిశ్రమ కార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు టీవీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

వీలైనంత త్వరగా చిత్రీకరణలు ప్రారంభిస్తాం: తలసాని

ఇదీచూడండి: చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం: తలసాని

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details