తెలంగాణ

telangana

ETV Bharat / state

'భారీ వర్షాలు పడే అవకాశం... అప్రమత్తంగా ఉండండి' - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని సూచన

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని ఆయన సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని తెలిపారు.

'భారీ వర్షం పడే అవకాశం... అప్రమత్తంగా ఉండండి'
'భారీ వర్షం పడే అవకాశం... అప్రమత్తంగా ఉండండి'

By

Published : Oct 18, 2020, 7:27 PM IST

హైదరాబాద్​ నగరంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని... అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.

అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని జీహెచ్ఎంసీ షెల్టర్లకు తరలించాలని పేర్కొన్నారు. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: మూసీ ఉగ్రరూపం.. ముసారాంబాగ్‌ వంతెనపై వరద ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details