తెలంగాణ

telangana

ETV Bharat / state

'పది గంటలకు- పది నిమిషాలు'లో పాల్గొన్న మంత్రి - minister-thalasani srinivas yadav

సీజనల్​ వ్యాధుల నివారణ కోసం ప్రతి ఆదివారం పది గంటలకు దోమల నివారణ చర్యల్లో పాల్గొనాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తన ఇంటి వద్ద రసాయన ద్రావణాలను పిచికారీ చేశారు.

minister-thalasani-spraying-chemicals-at-home in west maredpalli
'పది గంటలకు- పది నిమిషాలు'లో పాల్గొన్న మంత్రి

By

Published : May 10, 2020, 12:36 PM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు వెస్ట్​ మారేడ్​పల్లిలోని తన నివాసం వద్ద పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రసాయన ద్రావణాలను పిచికారీ చేశారు. ఎంటమాలజీ విభాగం వారి సహకారంతో దోమల నివారణకై తన ఇంటి పరిసర ప్రాంతాల్లో రసాయన ద్రావణాలను చల్లారు.

దోమల నివారణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలను నివారించేందుకు జీహెచ్ఎంసీ దోమల నివారణ విభాగాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

'పది గంటలకు- పది నిమిషాలు'లో పాల్గొన్న మంత్రి

ఇదీచూడండి: మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ABOUT THE AUTHOR

...view details