రాష్ట్రంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం పశు సంవర్ధక శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో ఫిబ్రవరి 1 నుంచి నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేసే యోచనలో భాగంగా పశువులు కలిగిన రైతులు, పశు వైద్య సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
'గాలికుంటు నివారణపై సందేహాల కోసం ప్రత్యేక కాల్ సెంటర్' - గాలికుంటు టీకాల తాజా సమాచారం
రాష్ట్రంలో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. దీనిని మరింత పటిష్ఠం చేసేందుకు హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

'గాలికుంటు నివారణపై సందేహాల కోసం ప్రత్యేక కాల్ సెంటర్'
9121213220 నంబరుకు ఫోన్ చేసి తక్షణ సూచనలు పొందవచ్చని తెలిపారు. రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
ఇదీ చదవండి:మూగజీవాల సంరక్షణ కోసం.. చిన్నారి అక్షర యజ్ఞం