ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాలకు రూపకల్పన చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాచిగూడలో బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. ఇదివరకే హైదరాబాద్ లో 175 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
'బస్తీ దవాఖానాలతో పేద ప్రజలకు మేలు' - Basthi dhavakana news
బస్తీ దవాఖానాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాచిగూడలో ఆయన బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
'బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మేలు'
వాటికి అదనంగా ఈరోజు మరో 25 దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బస్తీ దవాఖానాల్లో అత్యాధునిక సదుపాయాలతో అన్ని రకాల సేవలను అందుబాటులో ఉంటాయన్నారు. అందరూ బస్తీ దవాఖానాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇవీచూడండి:అవగాహనాలోపం.. భక్తులకు తప్పని ఇబ్బందులు