కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయని.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న ముందస్తు చర్యల వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించ గలిగామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలోని అండాలమ్మ బస్తీలో పేద ప్రజలకు, వలస కూలీలకు నియోజకవర్గ ఇంఛార్జి ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ముందస్తు చర్యల వల్లే నియంత్రించ గలిగాం: తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ముందుస్తు చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించ గలిగామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని అండాలమ్మ బస్తీలో పేద ప్రజలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ముందస్తు చర్యల వల్లే నియంత్రించగలిగాం: తలసాని
ఈ సందర్భంగా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికులను ఆదుకుంటున్న వారిని మంత్రి అభినందించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు ఇంకొన్ని రోజులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.