ఆటలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రీడల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సీఎం కప్ కబడ్డీ టోర్నమెంట్‌ను స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ప్రారంభించారు.
'క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి' - హైదరాబాద్ జిల్లా వార్తలు
క్రీడల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జింఖానా మైదానంలో సీఎం కప్ కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆటలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం అన్ని క్రీడలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తోందని తలసాని అన్నారు. రాష్ట్ర క్రీడ కబడ్డీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్, డీవై హెచ్ సుధాకర్, రాజ్యసభ మాజీ సభ్యుడు నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్