జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాల్లో పూడికతీత పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ పనుల్ని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారని చెప్పారు.
ముంపు ప్రాంతాల్లో నేటి నుంచి 19వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు నాలాల్లో పూడికతీత, అభివృద్ధి పనుల్ని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించనున్నారు. ఆయాప్రాంతాల్లో నాలాల పూడికతీత సవ్యంగా జరగకుంటే, నాలాల్లో ఏదైనా సమస్యలుంటే నేరుగా పౌరులే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను కేటాయించారు.
ఫిర్యాదులు పంపాల్సిన నంబర్ 98480 21665