ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమీర్ పేట డివిజన్‌లోని లీలానగర్‌లో రూ. 38 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. కాలనీ ప్రజల అవసరాల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను చిన్న చిన్న పంక్షన్‌లు, కాలనీ అభివృద్ధి కోసం సమావేశాల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే... వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తలసాని తెలిపారు. అనంతరం సనత్‌నగర్‌లోని నెహ్రు పార్కులో రూ. 1.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ప్లే కోర్టు తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యన్ని సహించే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు.