తప్పుడు ప్రచారాలతో భాజపా నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. శనివారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో తెరాస గెలుపు కోసం పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
భాజపా నేతలవి తప్పుడు ప్రచారాలు: మంత్రి తలసాని - Minister Talasani's election campaign in Sanath Nagar
మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా సనత్నగర్ నియోజవర్గ పరిధిలో పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపా నేతలవి తప్పుడు ప్రచారాలని ఈ సందర్భంగా తెలిపారు. బండి సంజయ్కు ఓ సవాల్ కూడా విసిరారు.
భాజపా నేతలవి తప్పుడు ప్రచారాలు: మంత్రి తలసాని
వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు 25 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటిస్తున్న భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి జీవో ఇప్పించాలని సవాల్ చేశారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో మాటలతో విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తెరాస వెంటే ఉన్నారని, జీహెచ్ఎంసి ఎన్నికలలో మేయర్ పీఠం తమదేనని దీమా వ్యక్తం చేశారు.