తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి తలసాని సమీక్ష - tomorrow minister talsani review meetin

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీలతో కలిసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రేపు సమీక్ష నిర్వహించనున్నారు.

tomorrow minister talsani review meetin
కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి తలసాని సమీక్ష

By

Published : May 16, 2021, 3:21 PM IST

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాధి బారిన పడిన వారికి అందుతున్న సేవలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రేపు సమీక్ష నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీలతో కలిసి ఈ అంశంపై సమీక్షించనున్నారు.

ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, ఉప వైద్యాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొంటారు. ఇప్పటి వరకు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహించారు, ఎన్ని పాజిటివ్​గా గుర్తించబడ్డాయి, ప్రతి రోజు ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు, ఎన్ని బెడ్​లు అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్ సరఫరా, మందుల సరఫరా వంటి అంశాలపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశంలో సమీక్షిస్తారు.

ఇవీ చదవండి:జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

ABOUT THE AUTHOR

...view details