వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ మోండా మార్కెట్‌లోని పెరుమాళ్ వెంకటేశ్వర స్వామిని మంత్రి తలసాని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తలసాని... పెరుమాళ్ దేవాలయం ఎంతో చరిత్ర కలిగిందని తెలిపారు.
పెరుమాళ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి తలసాని - vaikunta ekadasi celebrations in Hyderabad
వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ మోండా మార్కెట్‌లోని పెరుమాళ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని మొక్కుకున్న మంత్రి.. కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని వేడుకున్నారు.
పెరుమాళ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి తలసాని
వైకుంఠ ఏకాదశి ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించిన తలసాని... త్వరగా కరోనా మహమ్మారి అంతమవ్వాలని స్వామివారిని వేడుకున్నారు.
- ఇదీ చూడండి :కరోనా జాగ్రత్తల మధ్య క్రిస్మస్ వేడుకలు