నాలాలపై అక్రమకట్టడాలు నిర్మించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ బేగంబజార్‌లో నిర్మిస్తున్న ఉస్మాన్ గంజ్ నాలాపై బ్రిడ్జ్ పునర్ నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్లు, వ్యాపారస్థులతో బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తయ్యే విధంగా సహకరించాలని కోరారు. నాలాపై అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసిన వారు తక్షణమే ఖాళీ చేయాలని... లేని పక్షంలో కూల్చేయవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నాలాలపై నిర్మాణాలు చేపట్టొద్దు: మంత్రి తలసాని
నాలాలపై అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. హైదరాబాద్ బేగంబజార్‌లో ఉస్మాన్‌గంజ్ నాలాపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వాననీరు చేరకుండా పనులు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
నాలాలపై నిర్మాణాలు చేపట్టొద్దు: మంత్రి తలసాని
భారీ వర్షం వస్తే దుకాణాలు మొత్తం నేలమట్టం అవుతాయని దృష్టిలో పెట్టుకొనే ఈ బిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మొన్నటి వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలో వచ్చిన నీరు మళ్లీ రాకుండా పనులు పూర్తి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నూతన టెక్నాలజీతో వేగంగా పూర్తి అయ్యే విధంగా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని తలసాని తెలిపారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు