ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియా త్వరలోనే వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ వద్ద గల పశు సంక్షేమ భవన్‌లో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
త్వరలో జీహెచ్‌ఎంసీలో సంచార చేపల మార్కెట్లు: తలసాని
రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లలు రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అందుబాటు ధరల్లో చేపలు విక్రయించేందుకు రాయితీపై జీహెచ్‌ఎంసీ పరిధిలో సంచార చేపల మార్కెట్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ముషీరబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నేతృత్వంలో గంగపుత్రులు మంత్రి తలసానితో సమావేశమయ్యారు. నూతనంగా నిర్మించిన కాళేశ్వరం, పాలమూరు, కొండపోచమ్మ, సుందిళ్ళ తదితర ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులోకి రావడంతో రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లలు రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో పెద్ద ఎత్తున మత్స్య సంపద పెరిగిందన్న మంత్రి ఆ సంపద ఈ వృత్తిలోని అందరికీ అందించాలనేది తమ ఉద్దేశం అని చెప్పారు. అందుబాటు ధరల్లో చేపలు విక్రయించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో రాయితీపై సంచార చేపల మార్కెట్లు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:'ఓసీ సంఘాల మహా గర్జనకు తరలిరండి'