కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అసోసియేషన్ సభ్యులు తనకు దృష్టికి తీసుకురావాలని... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్ డివిజన్లోని ఎస్ఆర్ నగర్, రాజరాజేశ్వరి నగర్లలో ఆయన పర్యటించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: తలసాని - హైదరాబాద్ తాజా వార్తలు
ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్ డివిజన్లోని ఎస్ఆర్ నగర్, రాజరాజేశ్వరి నగర్లలో ఆయన పర్యటించారు.
![ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: తలసాని Minister Talasani Srinivas Yadav visiting Sanath Nagar Division in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10815109-893-10815109-1614519120377.jpg)
'ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా'
ఎస్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీదేవి ఎన్నికయ్యారు. అనంతరం రాజరాజేశ్వరి నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఇదీ చదవండి: అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ అన్నం.. గ్రామస్థుల ఆందోళన