సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణంలో వైట్ టాపింగ్ రోడ్లు పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఆల్ఫా హోటల్ వద్ద ఫుట్పాత్కు ఇరువైపులా ఉన్న కొన్ని దుకాణాలను తొలగించాలని అధికారులకు సూచించారు. రోడ్డు విస్తీర్ణతోపాటు వైట్ టాపింగ్ రోడ్డుకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు రెండు కోట్ల వ్యయంతో రెండు కిలోమీటర్ల మేర ఈరోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తలసాని పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన తలసాని
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బాటా వరకూ నిర్మిస్తున్న వైట్ టాపింగ్ రోడ్డు పనులను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న తీరును గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన తలసాని
లాక్డౌన్ వల్ల మోండా మార్కెట్ వద్ద పనులు శరవేగంగా జరుగుతున్నాయని... ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.