సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ను రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. కూరగాయల వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసి మార్కెట్ మొత్తానికి అందించేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ ప్లాంట్ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ మార్కెట్లో ఇష్టారీతిగా నిబంధనలు అమలు చేసి... వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసేవని పేర్కొన్నారు.
బయోగ్యాస్ ప్లాంట్ను పరిశీలించిన తలసాని - తలసాని శ్రీనివాస్ యాదవ్ బోయిన్పల్లి మార్కెట్
కూరగాయల వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బయో గ్యాస్ ప్లాంట్ను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
![బయోగ్యాస్ ప్లాంట్ను పరిశీలించిన తలసాని మంత్రి తలసాని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7139023-277-7139023-1589102691868.jpg)
మంత్రి తలసాని
బోయిన్పల్లి మార్కెట్లో రైతులకు, హమాలీలకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు జరపడం మంచి పరిణామమని తలసాని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ వల్ల కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు.
ఇవీ చూడండి:అమ్మా.. నీ మనసు వెన్న..