రాష్ట్రసాధనలో సీఎం కేసీఆర్ కృషి ఎనలేనిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
అభివృద్ధి, సంక్షేమమే తెరాస లక్ష్యం: తలసాని - జెండాను ఆవిష్కరించిన మంత్రి తలసాని
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన జనరంజకంగా సాగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.
తన నివాసంలోపార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్రాన్ని సాధించే వరకు కేసీఆర్, తెరాస శ్రేణులు చేసిన పోరాటం ఎంతో గొప్పదన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా ఉన్న విద్యుత్, నీటి సరఫరా సమస్యలను అధిగమించినట్లు పేర్కొన్నారు.