ఈ ఏడాది బడ్జెట్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులతో ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి తలసాని అన్నారు. 90 శాతం బడ్జెట్ నిధుల లబ్ధిదారులు సంక్షేమ వర్గాలకు చెందినవారేనని మంత్రి స్పష్టం చేశారు. బీసీ వర్గాల కోసం పాటు పడిన జ్యోతిరావుపూలే జ్ఞాపకార్ధంగా హైదరాబాద్నగరంలో మ్యూజియం కట్టాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ సారథ్యంలో అన్ని రకాలు సంక్షేమ వర్గాల వారు అభివృద్ధి చెందేవిధంగా సీఎం ప్రగతిపథ బడ్జెట్ను కేటాయించడం ఆనందదాయకమని అన్నారు.
హైదరాబాద్లో జ్యోతిరావు పూలే మ్యూజియం: మంత్రి తలసాని
2020-21 ఏడాది బడ్జెట్లో బడుగు బలహీనవర్గాల వారికే పెద్దపీట వేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల్లో 90 శాతం మంది వెనుకబడిన వర్గాల వారేనని హైదరాబాద్ తెరాస కార్యాలయం వేదికగా ఆయన పేర్కొన్నారు.
బడ్జెట్లో బడుగుబలహీన వర్గాలకే పెద్దపీట: మంత్రి తలసాని