తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధికి పటిష్ఠ చర్యలు: తలసాని

రాష్ట్రంలో పాడి పరిశ్రమను బలోపేతం చేయడానికి పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​ అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డైరీ ఛైర్మన్లతో మంత్రి సమీక్షించారు.

రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధికి పటిష్ఠ చర్యలు: మంత్రి తలసాని
రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధికి పటిష్ఠ చర్యలు: మంత్రి తలసాని

By

Published : Jul 30, 2020, 7:51 PM IST

హైదరాబాద్​ మసబ్​ట్యాంక్​లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఆశాఖ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, సంచాలకులు వంగాల లక్ష్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలో మెగా డైరీ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

విజయ డైరీకి 32ఎకరాల భూమి... 99 ఏళ్లు లీజుకు

పశుసంవర్ధక శాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డైరీకి 99 ఏళ్లు లీజుకు ఇస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర సమక్షంలో ఒప్పంద పత్రాలపై డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డైరీ ఎండీ శ్రీనివాసరావు సంతకాలు చేశారు.

ఈ శ్రావణ మాసంలో మెగా డైరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న దృష్ట్యా... ఈలోగా నమూనా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్న మెగా డైరీలో మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని మంత్రి తలసాని సూచించారు.

సర్కారు పాఠశాలలపై సమీక్ష

అంతకు ముందు హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో డీఈవో వెంకట నర్సమ్మ, డిప్యూటీ డీఈవోలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:-యూనిఫామ్​కు మ్యాచింగ్​ మాస్కులు తప్పనిసరి..!

ABOUT THE AUTHOR

...view details