హైదరాబాద్ నగరంలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయం నుంచి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
'నిత్యావసర సమస్యలుంటే వెంటనే పరిష్కరించండి' - లాక్డౌన్ పరిస్థితులపై మంత్రి తలసాని సమీక్ష
లాక్‌డౌన్‌తో ప్రజలు నిత్యావసరాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. తన కార్యాలయంలో గ్రేటర్ పరిధిలో టెలికాన్ఫరెన్స్‌లో ప్రజా ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు.
'నిత్యావసర సమస్యలుంటే వెంటనే పరిష్కరించండి'
కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ అమలు జరుగుతున్న తీరును ప్రజాప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సమస్యలేమైనా ఉంటే వెంటనే స్పందించాలని సూచించారు.
ఇవీ చూడండి:కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..