కరోనా మహమ్మారి పట్ల ప్రజల్లో అవగాహన వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజల అప్రమత్తతోనే కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తలసాని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా నియంత్రణ, తీసుకుంటున్న నివారణ చర్యలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
'ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉంటే ఎవరైనా చికిత్స పొందవచ్చు' - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని సూచించారు. ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉంటే ఇతర రాష్ట్రాలు వారు ఎవరైనా సరే ఇక్కడ చికిత్స పొందవచ్చని తెలిపారు. జీహెచ్ఎంసీలో కరోనా నియంత్రణ చర్యలపై హోం మంత్రి, మేయర్‌తో సమీక్ష నిర్వహించారు.
ఇంటింటి సర్వే జరుగుతోందని.. ఇప్పటివరకు 9 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మానుకొని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని హితవు పలికారు. ప్రభుత్వానికి మానవతా దృక్పథం ఉందని.. అంబులెన్స్‌లను ఆపే విషయంపై గొడవ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉంటే ఎవరైనా వచ్చి చికిత్స పొందవచ్చని తలసాని స్పష్టం చేశారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు సుప్రీం ఆదేశం