Minister Talasani: మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రధాని హైదరాబాద్ బేగంపేటకు చేరుకున్న సందర్భంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం తప్పనిసరిగా రావాలని ఎక్కడా లేదన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా తాను వెళ్లినట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు ప్రధాని ఆకస్మాత్తుగా వచ్చి వెళ్లిపోయారని గుర్తు చేశారు. భాజపాకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తెరాసతో తలపడాలని ఆయన సవాల్ విసిరారు.
"మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రధానికి ప్రోటోకాల్ అవసరం లేదు. సీఎం అవసరం లేదు. ప్రధాని అనేక సార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలికారు. అది అప్పటినుంచే జరుగుతున్న పరిణామాలు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. బై బై మోదీ అనేది ఎప్పటినుంచో జరుగుతున్న అంశం. భాజపా వాళ్లు మాముఖ్యమంత్రి మీద ఒక క్యాప్షన్ పెట్టడం జరిగింది. హైదరాబాద్కి టూరిస్ట్లా వస్తున్నారు. మీరు ముందస్తు ఎన్నికలకు రండి అని మేము వారిని అడుగుతున్నాం." -తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్థక శాఖ మంత్రి