అభివృద్ధి కోసం పాటు పడుతున్న తెరాస ప్రభుత్వానికే.. ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అవకాశముంటుందని వివరించారు. హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మరింత అభివృద్ధి కావాలంటే.. మాకే ఓటేయండి: తలసాని - ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ
హైదరాబాద్, సనత్ నగర్ పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. పట్టభద్రులంతా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
మరింత అభివృద్ధి కావాలంటే మాకే ఓటేయండి: తలసాని
సీఎం కేసీఆర్ నాయకత్వంలో.. ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ.. రాష్ట్రం, దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వివరించారు. పట్టభద్రులంతా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జీ తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఆలోచించి మాట్లాడండి.. రాష్ట్రానికి భాజపా ఏం చేసింది?'