మంత్రి కేటీఆర్ సేవలు దేశానికి, రాష్ట్రానికి ఎంతో అవసరమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోశ్ గుప్తా ఆధ్వర్యంలో... హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గర్భవతులకు పండ్లు, డ్రైఫ్రూట్స్, చీరలు, మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు.
'దేశానికి, రాష్ట్రానికి కేటీఆర్ సేవలు ఎంతో అవసరం' - hydeerabad news
హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోశ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీలకు పండ్లు, డ్రైఫ్రూట్స్, చీరలు, మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు.
minister talasani srinivas yadav participated in ktr birthday celebrations
కేటీఆర్ జన్మదిన వేడుకలను ఎంతో ఆర్భాటంగా నిర్వహించుకోవాల్సి ఉన్నప్పటికీ... కొవిడ్ నిబంధనల వల్ల భౌతిక దూరం పాటిస్తూ... నిరాడంబరంగా నిర్వహించుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి కొనియాడారు. కరోనా వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతుందని... ఇలాంటి విపత్కర సమయంలో వైద్యులు, వారి సిబ్బంది అందిస్తున్న విశేష సేవలను మంత్రి కొనియాడారు.