ఐదు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి... ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు విజయ డెయిరీని గాడిలో పెడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ల్లో విజయ డెయిరీకి మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ప్రభుత్వ సహకార డైరీలకు పాలు పోసే పాడి రైతులకు... లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహకం ఇస్తున్నామన్నారు. దీనికోసం రూ.248 కోట్లు విడుదల చేశామని... కొవిడ్ కారణంగా కొందరికి అవి అందలేదని తెలిపారు. ఈ విషయంపై పాడి రైతులు ఆందోళన చెందనవసరం లేదని.. త్వరలోనే వారికి బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు.
రావిరాలలో మెగా డెయిరీ... ఏర్పాట్లన్నీ పూర్తి: తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్... పాడి పరిశ్రమ రంగానికి అడగకుండానే నిధులు సమకూరుస్తూ... వారిని అభివృద్ధి వైపుగా తీసుకెళ్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలోనే రావిరాలలో మెగా డెయిరీ నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
రావిరాలలో మెగా డెయిరీ... ఏర్పాట్లన్నీ పూర్తి: తలసాని
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో మెగా డెయిరీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. డెయిరీ నిర్మిస్తున్న స్థలాన్ని 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నామని సభకు వివరించారు.
ఇదీ చూడండి:శ్రీశైలం ప్రమాదం గురించి అప్పుడే ఏం చెప్పలేం: మంత్రి జగదీశ్ రెడ్డి