నగరంలో నూతనంగా నిర్మించిన వైట్ ట్యాపింగ్ రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్నామని మినిస్టర్ రోడ్డులో వ్యాపారులు మంత్రి తలసానికి విన్నవించుకున్నారు. వ్యాపారుల సమస్యను తెలుసుకునేందుకు ఇవాళ ఆయన రాణిగంజ్‌లోని ఫుట్‌పాత్‌ను పరిశీలించారు. ఫుట్‌పాత్ పనులు చేసేటప్పుడు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా దుకాణదారులు కూడా నగరాభివృద్ధికోసం చేస్తున్న పనుల్లో రాజకీయ పరమైన అంశాలను తీసుకురావొద్దని ఆయన సూచించారు. వైట్ టాపింగ్ రోడ్లు వల్ల ఎంతో ఉపయోగం ఉందని వారికి వివరించారు.
'వైట్ ట్యాపింగ్ రోడ్డు నిర్మాణం వల్ల ఏర్పడే సమస్యలు పరిష్కరిస్తాం' - వైట్ ట్యాపింగ్ రోడ్డు నిర్మాణం వల్ల ఎటువంటి సమస్యలు రావని మంత్రి హామీ
కొత్తగా వైట్ ట్యాపింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఫుట్‌పాత్ విషయంలో తమ వ్యాపారాలకు ఆటంకం కలుగుతోందని మినిస్టర్ రోడ్డులో వ్యాపారులు మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు. పనులను పరిశీలించిన మంత్రి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
'వైట్ ట్యాపింగ్ రోడ్డు నిర్మాణం వల్ల ఏర్పడే సమస్యలు పరిష్కరిస్తాం'