హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మత్స్యశాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ సహకారంతో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
'మత్స్య కుటుంబాల అభివృద్ధే కేసీఆర్ అభిమతం' - ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ 2020
మత్స్యకారులు, మత్స్యరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు.
!['మత్స్య కుటుంబాల అభివృద్ధే కేసీఆర్ అభిమతం' minister talasani srinivas yadav launch fish food festival at ntr stadium](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6241701-thumbnail-3x2-fish.jpg)
'మత్స్య కుటుంబాల అభివృద్ధే కేసీఆర్ అభిమతం'
'మత్స్య కుటుంబాల అభివృద్ధే కేసీఆర్ అభిమతం'
చేపల వంటల స్టాళ్లను మంత్రి కలియ తిరిగి పరిశీలించారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేదే కేసీఆర్ అభిమతమని మంత్రి పేర్కొన్నారు. మత్స్య రంగం అభివృద్ధికై కోట్లాది రూపాయలతో అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు.