తెలంగాణ

telangana

ETV Bharat / state

MINISTER TALASANI: 'జంటనగరాల్లో నిమజ్జన ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తాం' - ganesh immersion arrangements at tankbund

హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్​బండ్ పరిసరాల్లో నిమజ్జన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సమీక్షించారు. ఈసారి జంటనగరాల్లో గణేష్ మహా నిమజ్జన ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈసారి ట్యాంక్​బండ్​పై 40 క్రేన్ల ద్వారా గణేష్ ప్రతిమలు నిమజ్జనం చేసేలా ప్రణాళిక రూపొందించారు.

MINISTER TALASANI: 'జంటనగరాల్లో నిమజ్జన ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తాం'
MINISTER TALASANI: 'జంటనగరాల్లో నిమజ్జన ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తాం'

By

Published : Sep 17, 2021, 7:59 PM IST

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి జంటనగరాల్లో గణేష్ మహా నిమజ్జన ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్​బండ్ పరిసరాల్లో నిమజ్జన ఏర్పాట్లను పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, సీపీ అంజనీకుమార్​లతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసారి ట్యాంక్​బండ్​పై 40 క్రేన్ల ద్వారా గణేష్ ప్రతిమలు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని.. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం క్రేన్ నంబర్ ఆరు వద్ద జరుగుతుందని మంత్రి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను, సుప్రీకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా ఏర్పాట్లుంటాయని మంత్రి చెప్పారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు విధుల్లో 19వేల మంది పోలీసులుంటారని ఆయన పేర్కొన్నారు. వీరితో పాటు ఆరోగ్యసిబ్బంది, సానిటరీ సిబ్బంది, ఆర్ అండ్ బీ, హెచ్ఎండీఏ ఇలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో దాదాపు 40వేల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్​ బండ్​ చుట్టూపక్కలే కాకుండా సుమారు 14 చెరువులు ఉన్నాయి. 14చెరువుల వద్ద కూడా మూడు షిప్టులుగా క్రేన్లను ఏర్పాటు చేశాం.దాంతో పాటు 25 బేబీ పాండ్స్​ను కూడా ఇటీవల ఏర్పాటు అయ్యాయి. విద్యుత్​ కూడా ఏర్పాట్లలో ప్రధాన భూమిక పోషిస్తుంది. వీధి లైట్లను కూడా ఏర్పాటు చేశాం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశాం. అన్ని శాఖల అధికారులతో సమన్వయం కోసం వాట్సప్​ గ్రూపును ఏర్పాటు చేశాం. -తలసాని శ్రీనివాస్​ యాదవ్​, రాష్ట్ర మంత్రి

మహాగణపతిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

హైదరాబాద్​లో చివరి రోజు వినాయక నిమజ్జనం సాఫీగా జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఖైరతాబాద్ మహాగణపతిని ఇవాళ మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించింది. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆయనకు అందజేశారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు వచ్చిన విఘ్నాలు సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోయాయని.. దీంతో భక్తుల్లో ఉత్సవాలపై నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిందని మంత్రి అన్నారు. ఇదే స్ఫూర్తితో నిమజ్జన ఉత్సవాలను సైతం సజావుగా పూర్తి చేసుకుందామని మంత్రి భక్తులకు పిలుపునిచ్చారు.

MINISTER TALASANI: 'జంటనగరాల్లో నిమజ్జన ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తాం'

ఇదీ చదవండి: BANDI SANJAY: 'విమోచన ఉత్సవాలు జరపనందుకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి'

ABOUT THE AUTHOR

...view details