తెలంగాణ

telangana

ETV Bharat / state

Talasani: 'ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా' - సనత్​నగర్ డివిజన్​పై తలసాని కమెంట్స్

హైదరాబాద్​ సనత్​నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్​పేట పద్మారావునగర్​లో సుమారు రూ. 89 లక్షల విలువైన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్
Minister talasani

By

Published : Jun 11, 2021, 5:51 PM IST

నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) తెలిపారు. హైదరాబాద్​ సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్​పేట పద్మారావునగర్​లో సుమారు రూ. 89 లక్షల విలువైన అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) ప్రారంభించారు.

ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అధికారులు కూడా ప్రజా సమస్యలపై సకాలంలో స్పందించాలని ఆదేశించారు. రహదారుల, డ్రైనేజి, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ జరుగుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Eatala: ఈటల నివాసానికి తరుణ్ చుగ్​తో పాటు భాజపా నేతలు

ABOUT THE AUTHOR

...view details