ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్(Talasani) అన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగా (Yoga Day) చేయాలని సూచించారు. సనత్‌నగర్‌లోని కంజర్ల లక్ష్మీనారాయణ పార్కులో సుమారు రూ. 16 లక్షల వ్యయంతో నిర్మించిన యోగా సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
Talasani: ధ్యానంతోనే ఆరోగ్యం: మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్తలు
మానవ జీవితంలో యోగా ప్రధాన భాగమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్(Talasani Srinivas Yadav) అన్నారు. సనత్‌నగర్‌లోని కంజర్ల లక్ష్మీనారాయణ పార్కులో నూతనంగా నిర్మించిన యోగా సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.
తలసాని
ఇక్కడ సాధన మందిర్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా ఒక్కటే సాధనమని మంత్రి పేర్కొన్నారు.