basti dawakhana : పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తున్నట్ల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ బస్తీ దవాఖానాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హమాలీ బస్తీలో నూతంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు.
basti dawakhana : 'పేదలకు మెరుగైన వైద్యం కోసమే బస్తీ దవాఖానాలు' - తెలంగాణ వార్తలు
basti dawakhana : ప్రభుత్వ వైద్యసేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హమాలీ బస్తీలో నూతనంగా ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు.
![basti dawakhana : 'పేదలకు మెరుగైన వైద్యం కోసమే బస్తీ దవాఖానాలు' basti dawakhana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13870773-615-13870773-1639136937231.jpg)
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు 2 చొప్పున 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు 258 ఏర్పాటు చేయడం జరిగిందని.. ఇవాళ మరో ఆస్పత్రిని ప్రారంభించినట్లు వివరించారు. బస్తీదవాఖానాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. మందులు కూడా ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:KTR Pressmeet: 'కేంద్రానికి ఇక విజ్ఞప్తులు చేయం.. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం'