పెంపుడు జంతువులకు ప్రస్తుత కాలంలో మంచి డిమాండ్ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బంజారాహిల్స్‌లో డా.మురళీధర్, ఆయన కుమార్తె చైత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ మై డాగ్ లగ్జరీ స్పా అండ్ సెలూన్‌ను ప్రారంభించారు. పెంపుడు జంతువుల సంరక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతతో ఈ సెలూన్‌లు అందుబాటులోకి రావడం హర్షనీయన్నారు. పూర్వ కాలంలో ప్రతి ఒక్కరు పెంపుడు జంతువులను పెంచుకునే వారని... ఈ మధ్యకాలంలో పాశ్చత్య సాంస్కృతిక కారణంగా జంతువుల పెంపకం తగ్గిపోయిందన్నారు.
డాగ్ సెలూన్ ప్రారంభించిన మంత్రి తలసాని - ఓ మై డాగ్ లగ్జరీ స్పా అండ్ సెలూన్
ఆరోగ్య సంరక్షణ మనుషులకు ఎంత అవసరమో... ప్రేమతో పెంచుకునే పెంపుడు జంతువులకు అంతే అవసరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ మై డాగ్ లగ్జరీ స్పా అండ్ సెలూన్‌ను ప్రారంభించారు.
![డాగ్ సెలూన్ ప్రారంభించిన మంత్రి తలసాని minister talasani srinivas yadav inaugurate ohh my dog luxury pet spa and saloon at banjarahills hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7410804-thumbnail-3x2-hyd.jpg)
డాగ్ సెలూన్ ప్రారంభించిన మంత్రి తలసాని
ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని ఏవిధంగా కోరుకుంటారో... అదే విధంగా పెంచే పెంపుడు జంతువులను అందంగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా సెలూన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వహకురాలు చైత్ర తెలిపారు.
ఇదీ చూడండి:మోదీ 2.0: జల సంరక్షణతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు