తెలంగాణ

telangana

ETV Bharat / state

సదర్​ ఉత్సవాల్లో మంత్రి తలసాని-స్టెప్పులేసిన మాజీ ఎంపీ - ANJAN KUMAR YADAV DANCE IN SADAR FESTIVAL

హైదరాబాద్​ ఖైరతాబాద్​లో సదర్​ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మాజీ ఎంపీ అంజన్​కుమార్​ యాదవ్​ పాల్గొన్నారు. ఉత్సవాల్లో యువకులతో కలిసి అంజన్​కుమార్​ యాదవ్​ స్టెప్పులేశారు.

MINISTER TALASANI SRINIVAS YADAV IN SADAR FESTIVAL IN HYDERABAD

By

Published : Oct 28, 2019, 9:38 PM IST

తెలంగాణ సంస్కృతిలో భాగమే సదర్ ఉత్సవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని పెద్ద గణేష్ వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో తలసాని పాల్గొన్నారు. దీపావళి పండుగ అనంతరం జంట నగరాల్లో యాదవులు వైభవంగా సదర్ ఉత్సవాలు జరుపుకుంటారని మంత్రి తలసాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఖైరతాబాద్‌లో ప్రభుత్వపరంగా సదర్ ఉత్సవాలు నిర్వహించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఉత్సవాలకు హాజరయ్యారు. యువకులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

సదర్​ ఉత్సవాల్లో మంత్రి తలసాని- చిందేసిన మాజీ ఎంపీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details