సికింద్రాబాద్ క్లాక్‌టవర్ సమీపంలోని వెస్లీచర్చిలో బీఎస్ డేవిడ్ ఫౌండేషన్, గాస్పల్ టీవీ ఆధ్వర్యంలో 100 మంది జర్నలిస్టులకు, 100 మంది చర్చి పాస్టర్లకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు పాల్గొని సరుకులు అందజేశారు. కొవిడ్ కష్టకాలంలో క్రైస్తవ సోదరులు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు.
సికింద్రాబాద్‌లో నిత్యావసరాలు పంచిన మంత్రి తలసాని - మంత్రి తలసాని నిత్యావసరాల పంపిణీ
సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో జర్నలిస్టులకు, చర్చి పాస్టర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసరాలను పంచి పెట్టారు. బీఎస్ డేవిడ్ ఫౌండేషన్, గాస్పల్ టీవీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా మంత్రి పాల్గొని సరుకులు అందజేశారు.

సికింద్రాబాద్‌లో నిత్యావసరాలు పంచిన మంత్రి తలసాని
నగరంలో అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నిత్యం 90 వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రతి రోజు 50 వేల మందికి భోజనం పంపిణీ చేస్తున్నాయని మంత్రి చెప్పారు. పేదవాళ్లు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 1500 లను సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు.
ఇదీ చూడండి:పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ