తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్లకు దీటుగా ప్రభుత్వాస్పత్రులు: తలసాని - సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి తలసాని

ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు మంత్రి తలసాని.. తన నివాసంలో చెక్కులను అందజేశారు. సరైన వైద్యం చేయించుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం రిలీఫ్​ ఫండ్​ ఆపద్బాంధవుడిగా మారిందని ఆయన అన్నారు.

cm relief fund cheques, minister talasani srinivas yadav
సీఎం సహాయనిధి చెక్కులు, మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​

By

Published : Jan 24, 2021, 4:50 PM IST

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్​ వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసంలో సీఎం రిలీఫ్ ​ఫండ్​ ద్వారా.. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. రూ. 8 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి వైద్యం చేయించుకోవడానికి సీఎం సహాయనిధి ఆపద్బాంధవుడిగా మారిందని తలసాని అన్నారు. సహాయనిధి ద్వారా వచ్చే డబ్బుల విషయంలో దళారులను నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఉద్యోగ సంఘాలను దూరం చేసేందుకు విఫలయత్నం: పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details