పేదల ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వరదల్లో నష్టపోయిన అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. సనత్ నగర్ డివిజన్లోని అల్లావుద్దీన్ కోటి, అమీర్‌పేటలోని పిండి గిర్ని బస్తీలో బాధిత కుటుంబాలకు రూ.పదివేల ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు.
పేదల ఆకలి తీర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం: తలసాని - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్
పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సాయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.
పేదల ఆకలి తీర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం: తలసాని
ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఈ సాయాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. వారి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పేదలను ఆదుకోవడానికి ప్రతిపక్షాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీ బాల్‌రెడ్డి, అమీర్‌పేట కార్పొరేటర్ శేషు కుమారి, స్థానిక తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
TAGGED:
hyderabad latest news