ప్రతిభను చాటేందుకు వయసుతో పని లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అథ్లెటిక్ పోటీల్లో 80-85 ఏళ్ల విభాగంలో సత్తా చాటిన పద్మారావు నగర్‌కు చెందిన ఆర్పీ భగవాన్ను మంత్రి సన్మానించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ తెరాస ఇంఛార్జీ గుర్రం పవన్ కుమార్ గౌడ్లతో కలిసి తలసానిని కలిశారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని భగవాన్ నిరూపించారని అన్నారు.
ప్రతిభకు వయసుతో పని లేదు: తలసాని
ఫిబ్రవరిలో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన అథ్లెటిక్ పోటీల్లో సత్తా చాటిన ఆర్పీ భగవాన్ను మంత్రి తలసాని అభినందించారు. ప్రతిభకు వయసుతో పని లేదని ఆయన అన్నారు. పట్టదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రతిభకు వయసుతో పని లేదు: తలసాని
హ్యామర్ త్రోలో వెండి, డిస్కస్ త్రోలో వెండి, జావలిన్ త్రోలో కాంస్య పథకాన్ని భగవాన్ సాధించారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పలు పోటీలను నిర్వహించారు.