పేదప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను... 27 మంది లబ్ధిదారులకు అందించారు.
అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది: తలసాని - కల్యాణ లక్ష్మి వార్తలు
దేశంలో ఎక్కడాలేని విధంగా తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది: తలసాని
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మీ, అమీర్‌పేట తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ అలీ, వీఆర్వో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి: జగదీశ్ రెడ్డి