కరీంనగర్ జిల్లా పాడి రైతులకు 4 రూపాయల ప్రోత్సాహకం అందడం లేదని జీవన్‌రెడ్డి మండలి దృష్టికి తెచ్చారు. కరీంనగర్, ముల్కనూరు, నల్గొండ పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్ధేశ్యంతోనే 50 శాతం రాయితీతో పాడి పశువులను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Reddy) వెల్లడించారు. పాల సేకరణ లక్ష లీటర్ల నుంచి నాలుగున్నర లక్షలకు పెంచామన్నారు. 4 రూపాయల రాయితీగా 285 కోట్లు రైతులకు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.
కరీంనగర్ డెయిరీకి ప్రోత్సాహకంపై అధికారులు దృష్టిపెట్టారు. తెరాస పాలనలో పాడి రైతుల సంఖ్య లక్ష 32వేలకు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో ఉన్న డెయిరీ పార్లర్లు 85 మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా పార్లర్ల సంఖ్య 544కు పెంచాం. విజయ డెయిరీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.